ఉట్టి కుండ... మట్టి కుండ - Raka Lokam

ఉట్టి కుండ... మట్టి కుండ

Share This



గురువు గారు ఇద్దరు శిష్యులను పరీక్షించాలనుకున్నారు.

"మీరు అదిగో అక్కడ దూరంగా కూర్చున్న కుమ్మరిని చూశారు కదా.... అతనికి నెలరోజుల పాటు చదువు నేర్పించండి." అన్నాడు గురువుగారు.

శిష్యులు నెలరోజుల పాటు ఆ కుమ్మరి దగ్గరకి వెళ్లి చదువు నేర్పే ప్రయత్నం చేశారు. పలక, బలపం తెచ్చి ప్రయత్నించాడు. ప్లే వే మెథడ్ ను పరీక్షించారు. చేయగలిగిందంతా చేశారు.

నెల రోజులు పూర్తయిపోయాయి.

"గురువుగారూ... నెల రోజులు ప్రయత్నించాను. కానీ ఆ కుమ్మరికి ఒక్క అక్షరం కూడా నేర్పలేకపోయాను." నిరాశగా అన్నాడు మొదటి శిష్యుడు.

రెండో శిష్యుడూ గురువు గారి దగ్గరకి వచ్చాడు. "గురువుగారూ... నేను కూడా అతనికి ఎంత ప్రయత్నించినా ఒక్క అక్షరమూ నేర్పలేకపోయాను." అన్నాడు.


కానీ రెండో శిష్యుడి ముఖంలో ఆనందం ఉంది. నిరాశ, విషాదాలు లేవు.

"అతనికి అక్షరం నేర్పలేకపోయాను కానీ... ఈ నెలలో కుండలు తయారు చేయడం నేర్చేసుకున్నాను గురువు గారూ!"


ఆనందో బ్రహ్మ!!


ముగ్గురు పిల్లలు బంతులాట భలేగా ఆడుకుంటున్నారు.

దారిన వెళ్లే సాధకుడు అక్కడే నిలబడి వారి ఆటనే చూస్తూ ఉండిపోయాడు. ఆట అంత రక్తిగా ఉంది మరి. ఆ పిల్లలు పూర్తిగా ఆటలో మునిగిపోయి ఉన్నారు.

చీకటి పడింది. పిల్లలు ఆట ఆపేశారు. బై బై చెప్పుకున్నారు. ఎవరిళ్లకి వాళ్లు బయలుదేరారు.

సాధకుడు వారిని ఆగమని సైగ చేశాడు.

మొదటి పిల్లాడిని సాధకుడు అడిగాడు.

"నువ్వెందుకు ఆటలాడుతున్నావు?"

"ఆట ఆడితే బలం వస్తుంది. మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. శరీరం దృఢంగా మారుతుంది. కండరాలు బలపడుతాయి. ఎముకలు గట్టిపడతాయి. అందుకే ఆటలు ఆడుతున్నాను" అన్నాడు వాడు.

"చాలా బాగుంది. నువ్వు మంచి బలవంతుడివి కావాలి" అని ఆయన ఆశీర్వదించాడు.

"ఆట ఆడితే మెదడులో చురుకుదనం వస్తుంది. చదువుకున్నది బాగా అర్థమౌతుంది" అన్నాడు రెండో వాడు.

"నువ్వు మంచి తెలివిమంతుడివి కావాలి" అని ఆశీర్వదించాడు సాధకుడు.

మూడోవాడు "ఆటాడితే నాకు ఆనందంగా ఉంటుంది. అందుకే నేను ఆటాడుతున్నాను" అన్నాడు.

సాధకుడు ఆ బాలుడి పాదాలపై పడిపోయాడు. "నువ్వే నాకు గురువువి. ఏ ప్రయోజనం ఆశించక, ఎలాంటి లాభమూ కోరుకోక కేవలం ఆత్మానందం కోసమే సాధన చేసే సామర్థ్యాన్ని నీ నుంచే నేర్చుకుంటాను" అన్నాడు.

5 comments:

  1. Good Information

    Regards,
    editor
    Nowtelugu.com

    ReplyDelete
  2. Sudhakar garu, second one is very impressive!

    ReplyDelete
  3. First time i visited your blog in last week. Articles were simply superb and now i started reading your past years articles also. Your articles were informative and very nice. Thank you for your Work and information.

    ReplyDelete

Pages