"డాక్టర్ గారూ ....తొమ్మిది గంటల్లోగా కుట్లు విప్పేస్తారు కదూ...."
నాలుగో సారి అడిగాడు ఆ ముసలాయన.
తొమ్మిదింటికి వెళ్లకపోతే ఏందో మిస్సయిపోతానన్నఆదుర్దా అణువణువునా కనిపిస్తోంది ఆ ఎనభై మూడేళ్ల ముసలాయనలో.....
"కుట్లు విప్పేస్తాను... గాయం మానిందో లేదో చూస్తాను... చిన్న పట్టీ వేస్తాను... అంతా కలిపి అరగంట చాలు"
డాక్టర్ గారి మాట విని ఆ ముసలాయనలో ఏదో భారం దిగినట్టనిపించింది.
ఆ రోజు పెద్దగా పేషంట్లు లేరు.
డాక్టర్ ముసలాయన కుట్లు విప్పి, మలాం ఏదో పూస్తూ ...."తొమ్మిది గంటలకు ఇంకో డాక్టర్ అపాయింట్మెంట్ ఉందా?" అని అడిగాడు.
"లేదు.... తొమ్మిదింటికి నా భార్యతో కలిసి టిఫిన్ చేయాలి."
ముసలాయన ఆదుర్దా చూసి...."ఒక్క పది నిమిషాలు ఆలస్యమైతే ఇబ్బందేం లేదు కదా... మీ భార్య ఏమీ అనుకోదు కదా?" అన్నాడు డాక్టర్.
"నా భార్య ఏమీ అనుకోదు. అసలామె నన్ను గుర్తే పట్టదు."
డాక్టర్ నిర్ఘాంతపోయాడు.
"ఆమె నన్ను గుర్తు పట్టడం మానేసి అప్పుడే అయిదేళ్లయిపోయాయి. ఆమె హాస్పిటల్ మంచానికే పరిమితం...." శూన్యంలోకి చూస్తూ అన్నాడా పెద్దాయన.
డాక్టర్ వైపు చూస్తూ "ఆమెకు అల్జీమర్స్ వ్యాధి. ఆమె మెదడు పనిచేయదు. జ్ఞాపకాలన్నీ చెరిగిపోయాయి. ఇప్పుడామె మెదడు తుడిచేసిన పలక. ఆమెఎవరినీ గుర్తించదు." అన్నాడు.
"ఆమె మిమ్మల్ని గుర్తుపట్టనప్పుడు వెళ్లి ఏం లాభం?" అన్నాడు డాక్టర్.
"ఆమె నన్ను మరిచిపోయింది. నేను ఆమెను మరిచిపోలేదు కదా డాక్టర్...." అన్నాడు ఆ పెద్దాయన చాలా మామూలుగా....
ఆ మెత్తటి మాటలోని అవ్యాజ ప్రేమ డాక్టర్ ను ఛెళ్లున తాకింది....
డాక్టర్ కళ్లు చెమర్చాయి. ఒళ్లు గగుర్పొడిచింది. చేతులు తెలియకుండానే కంపించాయి.
"నేనూ నా భార్యను ఇలాగే ప్రేమించగలగాలి" అనుకున్నాడు ఆ డాక్టర్.
(ఇది ఇవాళ్లే ఇంగ్లీషులో చదివాను. పంచుకోవాలనిపించింది.)
శభాష్...అద్భుతం!!! పెద్దాయనా....
ReplyDeletekoncham bhayamesindi meeda padutunna vayasu valla
ReplyDeletekoncham dukhmaesindi, gnaapakalu ae alzeemer raakundaanae tudichi pettukuni potunnaduku,
koncham muchataesindi, peddayana unconditional love chusi,
chaala baaga narrate chesav, rocks
- anantu