జిస్ దేశ్ మే గ్రేస్ బహతీ హై! - Raka Lokam

జిస్ దేశ్ మే గ్రేస్ బహతీ హై!

Share This




కేరళ విద్యాశాఖ మంత్రి గారికి తన అధికార నివాసం పేరు అస్సలు నచ్చలేదు.
ఆయన గారు తనకు కేటాయించిన భవనాన్ని చూశారు. చూడగానే భగ్గుమన్నారు. "ఛీ ... ఛీ... ఈ భవనంలోనా ... నేనా .... ఉండటమా ... నెవర్" అన్నారు. రుసరుసలాడుతూ వచ్చేశారు.

దీంతో అధికారులు తెల్లబోయారు.

భవనం బాగాలేదా అంటే బాగా ఉంది.
వసతులు లేవా అంటే అన్ని వసతులూ ఉన్నాయి.
సౌకర్యాలు లేవా అంటే సకల సౌకర్యాలూ ఉన్నాయి.
మరి సమస్యేమిటి?

"నాకు ఈ భవనం పేరు నచ్చలేదు. ఈ పేరు ఉన్నంత కాలం నేను ఈ భవనంలోకి అడుగుపెట్టే ప్రసక్తే లేదు" అన్నారుట మంత్రిగారు.
ఇంతకీ కేరళ విద్యాశాఖ మంత్రికి కేటాయించిన భవనం పేరు ఏమిటో తెలుసా?
"గంగ".

కేరళలో మంత్రుల కోసం ఈ మధ్యే నాలుగు కొత్త భవనాలు కట్టించారు. వాటికి దేశంలోని నదుల పేర్లు పెట్టారు. ఒకదాని పేరు నీల, ఒకటి కావేరీ, ఇంకొకటి భవానీ, చివరిది గంగ. నీలను ఎస్ సి వ్యవహారాల మంత్రి పి.కె. జయలక్ష్మికి కేటాయించారు. భవానీని టూరిజం శాఖ మంత్రి ఏ.పి. అనిల్ కుమార్ కి ఇచ్చారు. కావేరిని రేవుల శాఖ మంత్రి కే. బాబు గారికి ఇచ్చారు. అబూ రబ్ గారికి గంగ భవనాన్ని కేటాయించారు. కానీ "ఈ పేరు మా మతానికి విరుద్ధం. కాబట్టి పేరు మార్చాల్సిందే"అంటూ అబూరబ్ మంత్రివర్యులు పట్టుబట్టారు.

కేరళ విద్యాశాఖ మంత్రి గారి పేరు పి.కె. అబూ రబ్. ఆయన ముస్లిం లీగ్ నాయకుడు. ముస్లిం లీగ్, కాంగ్రెస్ లు కలిసి కేరళలో ప్రభుత్వం నడుపుతున్నాయి. అందువల్ల అబూ రబ్ గారికి విద్యాశాఖ దక్కింది.
చివరికి ఆయన పంతమే నెగ్గింది. భవనం పేరు గ్రేస్ గా మారింది.

ఇదిప్పుడు కేరళలో పెద్ద వివాదం. టీకె బలరాం అనే కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఒళ్లు మండి ఫేస్ బుక్ లో "నథింగ్ డిస్గ్రేస్ ఫుల్ అబౌట్ గంగ" అబూ రబ్ గారి వాల్ పై పోస్టు చేశారట. అయినా మంత్రిగారు రవ్వంతైనా చలించలేదు.
"జిస్ దేశ్ మే గంగా బహతీ హై" ఇది మన దేశం గురించి చాలా మంది చెప్పే మాట. గంగ ప్రవహించే దేశంగానే భారత్ చాలా మందికి తెలుసు. కేరళ విద్యామంత్రి గారు పాఠం చెబితే "జిస్ దేశ్ మే గ్రేస్ బహతీ హై" అనాలేమో?






No comments:

Post a Comment

Pages