నమ్మకం - Raka Lokam

నమ్మకం

Share This

సాధకుడు, అతని భార్య పడవలో విహరిస్తున్నారు....
ఉన్నట్టుండి నదిలో కల్లోలం మొదలైంది. పడవ అటూ ఇటూ భయంకరంగా ఊగసాగింది.
మునిగిపోతామేమోనన్న భయంతో భార్య కంగారు పడుతోంది.
భర్త మాత్రం నిశ్చింతగా, ప్రశాంతంగా కూర్చున్నాడు.
"అదేమిటి? పడవ మునిగిపోయేట్టుంది. నీకు భయం వేయడం లేదా?"
భర్త హఠాత్తుగా తన ఒరనుంచి కత్తి దూశాడు. భార్య మెడపై ఉంచాడు.
"నీకు భయం వేయడం లేదా? ఈ కత్తితో పొడిచేస్తానేమోనని అనిపించడం లేదా?" అని అడిగాడు.
"లేదు.... కత్తి భయంకరంగా ఉన్నా... కత్తిని పట్టుకున్న చేయి గురించి, ఆ చేయి వెనకున్న హృదయం గురించి నాకు బాగా తెలుసు. అందుకే భయం లేదు...." అంది ఆమె.
"నిజం చెప్పావు..... కత్తి భయంకరమే అయినా దాన్ని పట్టుకున్న చేతిపై నీకు నమ్మకం ఉంది. ఎందుకంటే కత్తిని పట్టుకున్న వాడు నీవాడు..... అలాగే కల్లోలం భయంకరమే అయినా కల్లోలాన్ని నడిపిస్తున్న చేయి భగవంతుడిది. భగవంతుడు మనవాడు... అందుకే అతనిపై నాకు నమ్మకం ఉంది... అందుకే భయం లేదు." అన్నాడు సాధకుడు.

2 comments:

  1. sadhakudu sare mari saamanya manushulaite padava munugutunnappudu kagaru padi bratakataniki prayatnistadu, taapeega kurchunte tappaka munugutadu...............

    ReplyDelete
  2. anduke saadhakudu ani wraashaanu Madhavji...

    ReplyDelete

Pages