కత్తెర... సూది.... - Raka Lokam

కత్తెర... సూది....

Share This


అనగనగా ఒక అద్భుతమైన దర్జీ.....
ఆయన దుస్తులు కుడితే భలే బాగుండేవి.... ఒంటికి చక్కగా అతికేవి. అందం ఇనుమడించేది.
రాజుగారు దర్జీ పనితనం చూసి ముగ్ధుడైపోయాడు.
ఏదైనా బహుమతిని ఇవ్వాలనుకున్నాడు.
దర్జీని పిలిపించాడు.
రత్నాలు, వజ్రాలు పొదిగిన బంగారు కత్తెర చేయించి బహుమతిగా ఇచ్చాడు.
"వద్దు మహారాజా... నాకు కత్తెర వద్దు" అన్నాడు దర్జీ.
మహారాజు ఆశ్చర్యపోయాడు. "మరేం కావాలి?" అని అడిగాడు.
"ఇవ్వాలనుకుంటే నాకు ఒక సూదిని ఇవ్వండి మహారాజా!"
"అదేమిటి? కత్తెర ఇస్తే వద్దన్నావు. సూది కావాలంటున్నావు. ఏమిటి సంగతి?" రాజు అడిగాడు.
"మహారాజా కత్తెర కోస్తుంది. సూది కుడుతుంది. కత్తెర ఒక్క బట్టను ముక్కలుముక్కలు చేస్తుంది. సూది ముక్కలు ముక్కలను కలిపి ఒక్కటి చేస్తుంది. మనం విడదీసేదాన్ని కోరుకోవాలా లేక కలిపి ఉంచేదాన్ని కోరుకోవాలా మీరే చెప్పండి ప్రభూ."
రాజు దర్జీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు.

No comments:

Post a Comment

Pages