దేవుడా ... నాకే ఎందుకిలా....? - Raka Lokam

దేవుడా ... నాకే ఎందుకిలా....?

Share This

ఆర్థర్ ఆష్.... ప్రపంచ చరిత్రలోనే ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ ను గెలుచుకున్న తొలి నల్లజాతీయుడు.....
1983 లో గుండెకు శస్త్రచికిత్స చేయించుకుంటూండగా పొరబాటున కలుషిత రక్తం ఎక్కించడంతో ఆయనకు ఎయిడ్స్ వ్యాధి వచ్చింది.
ఈ వార్త విని ఆష్ అభిమానులు మిన్ను విరిగి మీద పడ్డట్టు ఖిన్నులయ్యారు. వేలాది మంది కన్నీటి లేఖలు వ్రాశారు.
అందులో ఒక అభిమాని "మీకే ఎందుకు ఇంత భయంకరమైన వ్యాధి వచ్చింది. " అని చాలా బాధతో వ్రాశాడు. "అసలు దేవుడికి మిమ్మల్నే బాధ పెట్టాలని ఎందుకు అనిపించిందో?" అని అడిగాడు.


దానికి ఆష్ ఇలా జవాబిచ్చాడు.
"యాభై మిలియన్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడితే అందులో యాభై లక్షలమందికే ఆట సరిగ్గా అబ్బుతుంది."
"అందులో అయిదు లక్షల మందే ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాళ్ల స్థాయికి చేరుకుంటారు..."
"అందులో యాభై వేల మంది మాత్రమే టోర్నమెంట్ సర్క్యూట్ ఆటల స్థాయికి వస్తారు...."
"వారిలో అయిదు వేల మంది మాత్రమే గ్రాండ్ స్లామ్ స్థాయికి ... అంటే వింబుల్డన్....అమెరికన్ ఓపెన్... ఆస్ట్రేలియన్ ఓపెన్... ఫ్రెంచ్ ఓపెన్ ల స్థాయికి వెళ్తారు. వారిలో యాభై మంది మాత్రమే వింబుల్డన్ లో గట్టిపోటీనిస్తారు."
"వారిలో నలుగురే సెమీఫైనల్ కి వెళ్తారు."
"అందులో ఇద్దరే ఫైనల్ కి వస్తారు....."
"అలా ఫైనల్ లో గెలిచిన వాడే వింబుల్డన్ విజేత అవుతాడు... కప్ ను చేజిక్కించుకుంటాడు...."
"కప్పును గెలుచుకున్న నాడు నేను ... "దేవుడా ... నాకే ఎందుకింత ఆనందాన్నిచ్చావు" అని అడగలేదు. ఈ కష్టం వచ్చిపడినప్పుడు "దేవుడా నాకే ఎందుకీ కష్టాన్నిచ్చావు" అని మాత్రం ఎందుకు అడగాలి?"

5 comments:

  1. best example for positive thinking

    ReplyDelete
  2. a person must not be greatest by his physical personality but with his inner personality. Check it out everywhere... thank you sir for these greatest things. - MAHESH TUPAKULA

    ReplyDelete
  3. Its been a long time since I've read this article. But I can remember,it is an excerpt taken from yandamuri veerendranath's vijayaniki aaromettu (I think).whatsoever, Arthur Ashe was undoubtedly a person of noble character.He was certainly a hero to people of all ages and races. when I was in India,I had an addiction called book reading.But here(USA),anyone can hardly finds both time and books to read. Anyway thanks to RAKA GARU for posting this article and to my friend SRINIVASAREDDY ANDEM for providing me the chance of reading of this article by sharing.

    ReplyDelete
  4. Arthur Ashe was the one and only African American who won the Wimbledon title.

    ReplyDelete

Pages