అది రాష్ట్రపతి భవన్....
ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు రాష్ట్రపతి నుంచి కార్యాలయ కార్యదర్శి పీఎం నాయర్ కి ఫోను వచ్చింది.
కార్యదర్శి ఆశ్చర్యపోయాడు.
ఆ సమయంలో సాధారణంగా రాష్ట్రపతి నుంచి ఫోను రాదు.
"నాయకర్ గారూ.."
అవతల నుంచి రాష్ట్రపతి గొంతు ....
"వానల వల్ల రాత్రంతా నా బెడ్ రూమ్ లో లీకై నీళ్లు కారాయి. నేను సరిగ్గానిద్ర పోలేకపోయాను"
నాయర్ కొయ్యబారిపోయాడు.
రాష్ట్రపతి బెడ్ రూమ్ లీక్ కావడమంటే తన ఉద్యోగానికి మూడినట్టే.
"నాయర్ గారూ.... దాని గురించి నేనంతగా పట్టించుకోవడం లేదు. రాత్రే వేరే బెడ్ రూమ్ కి మారాను. పైగా దాన్ని మీరెలాగో ఇవాళ్ల బాగుచేస్తారు."
"......................"
"కానీ నేను బాధపడుతోంది రాష్ట్రపతి భవనంలోనే నివాసముండే ఉద్యోగుల క్వార్టర్ల గురించి. నాకు మరో బెడ్ రూమ్ ఉంది. వాళ్లలో చాలా మందికి ఒకే బెడ్ రూమ్ ఉంది. అసలు వాళ్ల పరిస్థితి ఏమిటి? ఒక సారి వారందరి ఇళ్లనూ పరిశీలించండి.... అవసరమైతే తక్షణం రిపేర్లు చేపట్టండి."
నాయర్ నోట మాట రాలేదు. అందరూ తమ బాధను ప్రపంచం బాధగా పెంచి పెద్ద చేసి చూస్తారు. ఈ మహనీయుడు తన బాధనుంచి ప్రపంచం బాధను అర్థం చేసుకుని, ప్రపంచం బాధను తన బాధగా అనుభవిస్తున్నాడు.
మరో వ్యక్తి అయి ఉంటే ఈ పాటికి తాను సస్పెండ్ అయి ఉండేవాడు. ఈ రాష్ట్రపతి తన వ్యక్తిగత ఇబ్బందిని ఎంత తేలిగ్గా తీసుకున్నాడు?
మనసులోనే చేతులు జోడించాడు నాయర్....
ఆ రాష్ట్రపతే మనందరికీ ప్రియతముడైన అవుల్ పకీర్ జైనులాబుద్దీన్ అబ్దుల్ కలామ్ ....
No comments:
Post a Comment