త్రీ ఈడియట్స్ ...... - Raka Lokam

త్రీ ఈడియట్స్ ......

Share This



అనగనగా త్రీ ఈడియట్స్....
అమీర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషీల్లా తెల్లారితే పరీక్ష ఉందనగా తెగ తాగేశారు. తాగిన మత్తులోనే వైరస్ బుఢ్ఢే అనబడే వీరూ సహస్రబుద్ధే ఇంటి ముందు పోస్టుబాక్సులో "చిన్న పని" కూడా కానిచ్చేశారు.
సినిమా త్రీ ఈడియట్లలా కాకుండా మనోళ్లకి పరీక్ష టైముకి మత్తు దిగింది.
చదవలేదు... మార్కులు రావు.... మరేం చేయాలి?
మన ఈడియట్లు చాలా తెలివైనవారు.... కట్టుకథలే వారి పెట్టుబడి.... కాకమ్మకబుర్ల సాలెగూడు అల్లేసి వీరూ సహస్రబుద్ధేని ఏమార్చేద్దాంలే అనుకున్నారు.
ఆల్ ఈజ్ నాట్ వెల్ .... ఫార్ములా ఉండనే ఉందాయె.
"సార్... నిన్న రాత్రి మా పక్కింటాయనకి గుండెపోటు వచ్చింది. ఆయన్ని కారులో హాస్పటల్ తీసుకెళ్లాం. దారిలో కారు టైరు పంచరైంది. కారును తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.... రాత్రంతా కష్టపడ్డాం.... పరీక్ష రాయలేం సార్... ఒక రెండు రోజుల టైమ్ ఇవ్వండి... బాగా ప్రిపేరై రాసేస్తాం..... మీ తోడు.... మీ అమ్మాయి కరీనా కపూర్ తోడు... మొదటి బెంచ్ చతుర్ రామలింగం తోడు......"

వీరూ సహస్రబుద్ధే ఓకే ఆనేశాడు.

రెండు రోజుల తరువాత పరీక్షకి త్రీ ఈడియట్స్ తిక్కతిక్కగా చదివేశారు. రె"ఢీ" అనేశారు.
"మీది స్పెషల్ కేస్.... కాబట్టి పరీక్ష కూడా స్పెషల్ గానే ఉంటుంది. ముగ్గురినీ వేర్వేరు గదుల్లో కూర్చోబడతాం. ఓకేనా " అని వీరూ సహస్రబుద్ధే అడిగాడు.
"వాఖే సార్...." మనవాళ్లు విజృంభించేశారు. బాగా ప్రిపేరై ఉన్నారు మరి.... ఆ మాత్రం ఉండదా....?
ముగ్గురూ వేర్వేరు గదుల్లో కూచున్నారు. కలాల మూతలు తెరిచారు... ఓం శ్రీగణేశాయనమః అనుకున్నారు. "తల్లీ నిన్ను దలంచి" అని సరస్వతి అమ్మవారిని తలచుకున్నారు...
ప్రశ్నపత్రం చూశారు.....

అందులో రెండంటే రెండు ప్రశ్నలున్నాయి.

క్వశ్చన్ నంబర్ వన్ - మీ పేరేమిటి ? (2 మార్కులు)
క్వశ్చన్ నంబర్ టూ - కారులో ఏ చక్రం టైరు పంచరైంది? (98మార్కులు)
ఎ. ఫ్రంట్ సైడ్ కుడి టైరు
బి. ఫ్రంట్ సైడ్ ఎడమ టైరు
సి. బ్యాక్ సైడ్ కుడి టైరు
డి. బ్యాక్ సైడ్ ఎడమ టైరు.


!!!!!!!!!!!
ఆల్ ఈజ్ ఇన్ ది వెల్.....!!



భారతీయ నరకం జిందాబాద్


ఒకాయన చనిపోగానే నరకానికి వెళ్ళాడు.
నరకంలోకి పోగానే అక్కడ బోలెడన్ని సెక్షన్లు కనిపించాయి. ఒక్కో దేశం తరఫున ఒక్కొక్క నరకం.
ముందుగా జర్మనీ నరకంలోకి వెళ్లాడు.
"ఇక్కడ ఏయే శిక్షలు విధిస్తారు?"
"ఇక్కడకి రాగానే ముందు ఎలక్ట్రిక్ చైర్ లో ఒక గంట సేపు కూచోబెడతారు. ఆ తరువాత మేకుల పడకపైన పడుకోబెడతారు. ఆ తరువాత జర్మన్ భటులు వచ్చి రోజు రోజంతా చావబాదుతారు."
అక్కడి శిక్షలు, ఆర్తనాదాలు చూసి ఆయన భయపడిపోయాడు.
పక్కనే ఉన్న అమెరికన్ నరకానికి వెళ్ళాడు.
ఆ తరువాత రష్యన్ నరకానికి వెళ్లాడు.
అన్ని నరకాల్లోనూ అవే శిక్షలు. అవే ఆర్తనాదాలు.
చివరగా ఆయన భారతీయ నరకంలోకి వెళ్లాడు.
అక్కడ పొడవాటి క్యూ ఉంది. పాపులందరూ పోటీపడుతున్నారు.... "త్వరగా శిక్ష వేయండి.... కమాన్.... క్విక్ ....." అని పోటాపోటీగా ప్రాధేయపడుతున్నారు.
ఆయన బోల్డంత ఆశ్చర్యపడిపోయాడు. "ఇక్కడ ఏయే శిక్షలు విధిస్తారు?"
"ఇక్కడకి రాగానే ముందు ఎలక్ట్రిక్ చైర్ లో ఒక గంట సేపు కూచోబెడతారు. ఆ తరువాత మేకుల పడకపైన పడుకోబెడతారు. ఆ తరువాత భారతీయ భటులు వచ్చి రోజు రోజంతా చావబాదుతారు."
"మిగతా నరకాల్లోనూ ఇవే శిక్షలు ఉన్నాయి కదా. అయినా ఇక్కడెందుకు ఇంత రద్దీ?" కుతూహలం ఆపుకోలేక ఆయన అడిగేశాడు.
"ఏముంది.... ఇక్కడ మెయింటెనెన్స్ వెరీ బాడ్..... ఎలక్ట్రిక్ చెయిర్ పనిచేయదు. మేకుల మంచంలో మేకులన్నీ ఎవరో దొంగిలించుకుపోయారు. ఇక భటుడు రాగానే రిజిస్టర్ లో సంతకం చేసి కాంటిన్ కి వెళ్లి కాఫీ తాగుతూంటాడు."

2 comments:

Pages