మాట దక్కింది.... మానం పోయింది.... - Raka Lokam

మాట దక్కింది.... మానం పోయింది....

Share This



ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. "దేవుడా నన్ను బతికించు. నాకు ఆరోగ్యం మెరుగుపడితే ఈ ఇల్లు అమ్మి వచ్చిన డబ్బు నీకు సమర్పించుకుంటాను" అని మొక్కుకున్నాడు.
ఆశ్చర్యం...
ఆతని జబ్బు నయమైంది.
అప్పుడే మొదలైంది అసలు చిక్కంతా. మొక్కు తీర్చాలి.
కానీ ఇల్లు వదులుకోలేడు.
కాస్త ఆలోచించాక ఒక ఊహ తట్టింది.
" నా ఇల్లు పది పైసలకు అమ్మేస్తాను. కానీ ఒక్క షరతు. నా ఇల్లు కొన్న వాడు నా కుక్కపిల్లను కూడా కొనాలి. కుక్కపిల్ల ధర పది లక్షలు." అని చాటింపు వేయించాడు.
ఒకాయన ఆ షరతుకి ఒప్పుకుని, ఇల్లు కొనుక్కున్నాడు.
ఇల్లు అమ్మిన వ్యక్తి పదిలక్షలు తన పేరిట బ్యాంకులో వేసుకున్నాడు. ఒక్క పది పైసలు దేవుడి హుండీలో వేసేశాడు.
"అమ్మయ్య ... మొక్కుబడి తీర్చుకున్నాను." అనుకున్నాడు సంతృప్తిగా...

మాట దక్కింది.
కానీ మానం పోయింది....



కష్టాలతో దోస్తీ




ఒక రైతు బోలెడు కష్టాల్లో ఉన్నా ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు.
ఒకసారి ఒక మిత్రుడు నీ ఆనందానికి రహస్యమేమిటో చెప్పు అని అడిగాడు.
"ఏముంది.... జరిగి తీరాల్సింది జరిగి తీరుతుంది. దానితో దోస్తీ చేయడం నేర్చుకుంటే చాలు. " అన్నాడు.
"................"
ఎవరైనా మనవైపు కత్తి విసిరితే దాన్ని రెండేరకాలుగా పట్టుకోవచ్చు. ఒకటి పిడిని పట్టుకోవడం. రెండోది పదునైన భాగాన్ని పట్టుకోవడం.
పిడి వైపున పట్టుకోగలగడం నేర్చుకుంటే చాలు.

No comments:

Post a Comment

Pages