మూడు వడపోతలు - Raka Lokam

మూడు వడపోతలు

Share This


గ్రీక్ తత్వవేత్త సోక్రటీస్ దగ్గరకు ఒక మిత్రుడు వచ్చి " నీకీ విషయం తెలుసా..." అంటూ ఏదో చెప్పబోయాడు.
సోక్రటీస్ అతడిని వారించాడు.
"మిత్రమా! నువ్వు చెప్పదలచుకున్నది చెప్పే ముందు మూడు వడపోతలు పోయాలు. ఆ పరీక్ష పూర్తయ్యాకే విషయం చెప్పు"
"సరే చెప్పు"
"నువ్వు చెప్పదలచుకున్నది పూర్తిగా నిజమేనా?"
మిత్రుడు నీళ్లు నమిలాడు...
"నిజమా అంటే ఖచ్చితంగా చెప్పలేను..... ఇది నేను ఆ నోటా ఈ నోటా విన్న మాట!"
"అంటే నువ్వు చెప్పేది నిజం కాదన్న మాట"
మిత్రుడు ఏమీ మాట్లాడలేదు.
"పోనీ రెండో పరీక్ష పెడదాం... నువ్వు చెప్పదలచుకున్న విషయం మంచిదా... చెడుదా?"
"అంత మంచి విషయమేమీ కాదనుకో" అన్నాడు మిత్రుడు నంగిలా...
"చెప్పేదేదో మంచే చెప్పు. చెడు చెప్పడం, తద్వారా చెడును వ్యాపింపచేయడం ఎందుకు?" అన్నాడు సోక్రటీస్.
మిత్రుడి నోట మాట రాలేదు. అలాగే ఉండిపోయాడు.
"ఇక మూడో ప్రశ్న! నువ్వు చెప్పే సంగతుల వల్ల మన సమాజానికి ఏదైనా ప్రయోజనం ఉందా?"
మిత్రుడు అడ్డంగా తలూపాడు.
"బాగుంది... చెప్పేది అబద్ధం... అందునా చెడు గురించి... అదీ కాకుండా దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అలాంటిది చెప్పడం ఎందుకు?"
మిత్రుడు మౌనంగా వెళ్లిపోయాడు.

ఆ రోజుల్లో గ్రీకు ప్రజలకు అబద్ధాలు, చెడూ, అంతకుమించి నిరర్థకమైన విషయాలు మాట్లాడటమే ఇష్టం. అందుకే మహాజ్ఞాని సోక్రటీస్ కి హెమ్ లాక్ అనే విషాన్ని తాగమని మరణదండన విధించారు.

1 comment:

  1. Manchi vishyam chepparu. Imagine if our media follows this..

    ReplyDelete

Pages