చెప్పేదొకటి... అర్థమయ్యేదొకటి... - Raka Lokam

చెప్పేదొకటి... అర్థమయ్యేదొకటి...

Share This



ఒక బహుళజాతి సంస్థ అరబ్బులకు సాఫ్ట్ డ్రింకులు అమ్మేందుకు భారీగా ప్రకటనలిచ్చింది. పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టింది.
ఆ హోర్డింగుల్లో మూడు బొమ్మలున్నాయి.
మొదటిది - మండుటెండలో కటిక ఎడారిలో దప్పికతో అలమటిస్తూ కునారిల్లుతున్న ఒక వ్యక్తి బొమ్మ.
రెండవది - పూర్తిగా అలసిన వ్యక్తి సాఫ్ట్ డ్రింక్ తాగుతున్నాడు.
మూడవది - సాఫ్ట్ డ్రింక్ తాగతానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది.
ఈ అడ్వర్టయిజ్ మెంట్ ను ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు. ఎక్కడ చూసినా అవే.
ఇక అమ్మకాలే అమ్మకాలని ఆశపడ్డారు.
కానీ...
ఆశ్చర్యం...
సేల్స్ పెరగటం మాట అటుంచి ఉన్న సేల్స్ కూడా పడిపోయాయి.
ఆ కంపెనీకి అసలేం జరిగిందో అర్థం కాలేదు. తలలు బద్దలు గొట్టుకున్నారు.
చివరికి ఆలోచించగా ఆలోచించగా అసలు విషయం బయటపడింది.
అరబ్బులు మనలా ఎడమ నుంచి కుడికి కాక కుడి నుంచి ఎడమకి చదువుతారు.
ఈ బొమ్మను కూడా తిరగేసే అర్థం చేసుకున్నారు.
అంటే హాయిగా ఉత్సాహంగా ఉన్న వాడు సాఫ్ట్ డ్రింక్ తాగితే నీరసించిపోయాడని వాళ్లకు అర్థమైంది.
చాలా సార్లు జరిగేదిదే... మనం చెప్పేదొకటి... ఎదుటివాడికి అర్థమయ్యేదొకటి.



ఒక్క అక్షరం....





కమ్యూనికేషన్ మీదే మరో కథ!!
చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పెద్ద తప్పులకు దారి తీస్తుంది.
ఒకాయన భార్యకి ప్రేమలేఖ వ్రాశాడు. అందులో I wish you were here - నువ్విక్కడ నా చెంత ఉంటే ఎంత బాగుండు... అని అర్థం వచ్చేలా వ్రాయాలనుకున్నాడు.
హడావిడిలో చివరి పదంలోని చివరి అక్షరం వ్రాయడం మరచిపోయాడు. దాంతో అది ...
I wish you were her - అయింది. అంటే నువ్వు ఆమె అంత అందంగా ఉండే బాగుండు అని అర్థం వస్తుంది.

ఆ తరువాతేమైంది?
ఇంకేముంది?

ఆవిడ అప్పడాల కర్ర...
ఈయన బొప్పి కట్టిన బుర్ర...


అదీ సంగతి!!

No comments:

Post a Comment

Pages