కన్ను కాదు... చూపు కావాలి - Raka Lokam

కన్ను కాదు... చూపు కావాలి

Share This



"మనం వెళ్లే దారిలో మనకన్నా ముందు ఒక ఒంటె నడిచివెళ్లింది"

"ఆహా.... అలాగా"

"దాని ఎడమ కన్ను గుడ్డి"

"ఓహో"

"వెనక కాలు కుంటిది"

"అయ్యబాబోయ్... ఎలా చెప్పగలవు?

"అంతే కాదు... దాని పై వరస పళ్లలో ముందు పన్ను ఊడిపోయింది"

"ఆశ్చర్యం"

"దానికి వీపు మీద ఒక వైపు జొన్నలు, మరో వైపు తేనెసీసా వేళ్లాడగట్టారు"

రెండో వాడికి నోట మాట రాలేదు. కాస్సేపాగి "ఎలా చెప్పగలిగావు చెప్పవూ" అని అడిగాడు.

"దానిదేముంది... కళ్లుండి చూడగలిగితే చాలు.... కాలి అడుగుజాడలు చూస్తే ఒంటె వెళ్లిందని చెప్పొచ్చు. దాని వెనక అడుగు జాడ మిగతావాటికన్నా తక్కువ లోతులో ఉంది. కాబట్టి అది ఒక కాలు కుంటిది. ఒక వైపే గడ్డిమేసింది. కాబట్టి రెండో కన్ను గుడ్డిది. పచ్చికను కొరికిన చోట పళ్ల గుర్తుల మధ్య ఖాళీ ఉంది. కాబట్టి ముందరిపన్ను లేదన్న మాట. ఒక పక్క జొన్న గింజలున్నాయి. రెండో పక్క ఈగలు మూగాయి. కాబట్టి తేనె అయి ఉంటుందనుకున్నాను"

కళ్లు అవే... చూపులు వేరు... సరైన చూపు ఉంటే మిగతావారికి కనిపించనివి మనకు కనిపిస్తాయి.

No comments:

Post a Comment

Pages