నమ్మకం
వానలు కురవలేదు.
భయంకరమైన కరువు వచ్చిపడింది.
ప్రజలందరూ కలిసి వానదేవుడి కోసం యజ్ఞం చేయాలని నిర్ణయించారు. యజ్ఙం చేస్తే వాన పడుతుంది.
ఊరు ఊరంతా జత కూడింది.
ఓ బుజ్జిగాడూ వచ్చాడు. వాడి చేతుల్లో ఒక గొడుగు.
అందరూ వాడిని చూసి భళ్లున నవ్వారు.
"గొడుగెందుకురా?'
"యజ్ఞం చేస్తున్నాం కదండీ. వెళ్లేటప్పుడు వాన ఉంటుంది. వానలో తడిసిపోకుండా ఉండేందుకు గొడుగు తెచ్చుకున్నానండీ' అన్నాడు ఆ పిల్లవాడు.
తాము చేస్తున్న ప్రయత్నం పై తమకే నమ్మకం లేనందుకు తలలు వంచుకున్నారు పెద్దలు.
*****
అసలు పని
ఒక వ్యక్తికి ఆక్సిడెంట్ అయింది. అతను మూర్ఛపోయాడు. అతని పర్స్, స్కూటర్, సామాన్లు చెల్లాచెదరైపోయాయి.
చుట్టూ జనం గుమిగూడారు.
ఒకతను పర్సు తీసి గాయపడ్డ వ్యక్తి జేబులో జాగ్రత్తగా పెట్టాడు.
ఇంకొకతను స్కూటర్్ తీసి రోడ్డుకి ఒక పక్కన పార్కు చేసి, కిక్ కొట్టి, బండి సరిగా ఉందా లేదా చూశాడు.
మరొకతను గాయపడ్డ వ్యక్తి తాలూకు సామాను సర్ది ఒక పక్కన భద్రపరిచాడు.
నాలుగో వ్యక్తి పక్కనే ఉన్న హోటల్ నుంచి ఒక గ్లాసు నీరు తెచ్చి మూర్ఛపోయిన వ్యక్తి ముఖంపై చిలకరించాడు.
మూర్ఛపోయిన వ్యక్తికి స్పృహ వచ్చింది. అతను కళ్లు తెరిచాడు.
మరుక్షణం అతను తన జేబులో పర్సు ఉందా లేదా అన్నది చూసుకున్నాడు.
తన సామాను ఎక్కడుందో వెతికి చూసుకున్నాడు.
స్కూటర్ ఎక్కడుందా అని వెతికి చూసుకున్నాడు.
మూర్ఛలో ఉన్న వాడిని మేల్కొలిపితే చాలు. అదే అసలు పని....ఒక్కసారి మేల్కొంటే అతను తన పనిని తాను చేసుకోగలడు. తన జాగ్రత్త తాను చూసుకోగలడు.
మీ కథలు చాలా బాగా ఉన్నాయి. నమ్మకం మన నేతలకు వర్తిస్తుందని అనుకుంటున్నా... *అసలు పని* దీన్ని మనం ఎప్పుడో మర్చి పోయాం. ఆ మాత్రమన్న సహాయం చేసే గుణం ఉందని మీ కథలో చూపించారు అదే పదివేలులా ఉంది మన సమజం పరిస్తితి.... దాసరి వెంకట సుబ్బారావు
ReplyDelete