బండరాయి...బంగారు మూట
రాజుగారు రాజమార్గంపై ఒక బండరాయిని ఉంచారు. చెట్టుచాటున నక్కి ఏం జరుగుతుందో గమనిస్తున్నారు.
బడాబడా వ్యాపారులు వచ్చారు. రాయిని పట్టించుకోలేదు. పక్కనుంచి వెళ్లిపోయారు. "రాజుగారి పరిపాలన అధ్వాన్నంగా ఉంది. లేకపోతే రోడ్డు మీద అడ్డంగా బండరాయి ఉండటం ఏమిటి? దాన్ని ఇంత వరకూ తీయించకపోవడం ఏమిటి?' అంటూ తిట్టుకున్నారు.
ఉన్నతాధికారులు అదే దారిన వెళ్లారు. బండరాయిని చూసి " ఎవరక్కడ....ఇదెవరు చేశారు? వాడెవడో పట్టి కారాగారంలో పడేయండి' అని హుకుం జారీ చేశారు.
అందరూ వస్తున్నారు....వెళ్తున్నారు. తోచిన నాలుగు మాటలు అని వెళ్లిపోతున్నారు.
చివరికి ఒక రైతు వచ్చాడు. అతను బండి దిగి, బండరాయి దగ్గరకు వచ్చాడు. ధోతీ పైకి ఎగకట్టి, శక్తినంతా ఉపయోగించి ఆ రాయిని రోడ్డు పక్కకి జరిపేశాడు.
ఆ బండరాయి కింద ఒక బంగారు నాణాల మూట కనిపించింది. నిజానికి అది రాజుగారు దాచిందే.
తిట్టుకోవడమో లేక ఇతరులకు పురమాయించడమో కాదు. సవాలో లేక సమస్యో వచ్చినప్పుడు దాని పరిష్కారానికి స్వయంగా పూనుకోవాలి.
సమస్య అనే బండరాయి కింద అవకాశమనే బంగారు మూట ఉండొచ్చేమో.....
బీ యువర్ సెల్వ్స్
ఒక ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తికి ఒక విచిత్రమైన ఆహ్వానం వచ్చింది.
అదేమిటంటే తన పరిశోధనల గురించి ఒక న్యూడ్ క్లబ్ సభ్యులకు వివరించాలి.
న్యూడ్ క్లబ్ అంటే ఎవరూ ఒంటిమీద ఒక్క నూలుపోగు కూడా ధరించరు. పూర్తిగా దిశమొలలతో ఉంటారు.
అలాంటి వాళ్లకి ఎలా స్పీచి ఇవ్వాలి? వాళ్లు నగ్నంగా ఉంటే తాను మాత్రం కోటు సూటు బూటు వేసుకుంటే ఏం బాగుంటుంది. సిగ్గుగా ఉండదూ....ఇదీ ఆ శాస్త్రవేత్త సందేహం.
ఇటు న్యూడ్ క్లబ్ సభ్యులూ ఆలోచించడం మొదలుపెట్టారు. అంత గొప్ప శాస్త్రవేత్త వస్తున్నాడు. మనం దిశమొలలతో ఉంటే ఏం బాగుంటుంది అని తర్కించుకున్నారు.
చివరికి శాస్త్రవేత్త ప్రసంగించాల్సిన రోజు రానే వచ్చింది.
శాస్త్రవేత్త కారు వచ్చి న్యూడ్ క్లబ్ పోర్టికోలో ఆగింది.
ఆయన కిందకి దిగాడు....ఒక్క నూలుపోగు కూడా లేకుండా.....
ఆయన ఎదురుగా స్వాగతం చెప్పేందుకు న్యూడ్ క్లబ్ సభ్యులంతా నిలబడ్డారు...కోటూ సూటూ బూటూతో....
ఆ తరువాత ఏమైంది?
ఏమవుతుంది...లింగ దర్శనం...పాప నాశనం....అంతే...
నీతి - బీ యువర్ సెల్వ్స్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment