ఫుట్ బాల్ లో లైన్ మాన్ అన్న పొజిషన్ ఉంటుంది. వాళ్లు బాల్ ను టాక్లింగ్ చేస్తారు. అలాంటి ఓ లైన్ మాన్ కథ ఇది.
ఆ లైన్ మాన్ ఓ రోజు కోచ్ దగ్గరికి వచ్చాడు. "సర్... నేను రేపట్నించి ప్రాక్టీసులో ఫుల్ బ్యాక్ లతోపాటు పరుగెడతాను. దయచేసి అనుమతించండి." అన్నాడు. బ్యాక్ లు చాలా వేగంగా పరుగు తీస్తారు. లైన్ మాన్ ల కన్నా చాలా వేగంగా....
సరేనన్నాడు కోచ్.
ఆ మరుసటి రోజు నుంచీ ఆ లైన్ మాన్ బ్యాక్ లతో రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. మొదటి రోజు అందరికన్నా చివర స్థానంలో ఉన్నాడు.
రెండో రోజూ లాస్ట్. మూడో రోజూ లాస్ట్... ప్రతి రోజూ లాస్టే.
కోచ్ అతడిని పిలిపించాడు. "నీకు గెలవాలని లేదా? విన్నర్ గా ఉండాలన్న పట్టుదలే లేదా? బ్యాక్ లతో పరుగుపందెం వేసుకుంటే నువ్వు ప్రతి రోజూ లాస్ట్ గానే వస్తావు. వేస్ట్ గానే ఉంటావు. నీ తోటి లైన్ మాన్ లతో రన్నింగ్ ప్రాక్టీస్ చెయ్యి. నువ్వే ఫస్ట్ వస్తావు. నువ్వే విన్నర్ గా ఉంటావు. విన్నింగ్ ఈజ్ ఎ హ్యాబిట్ యు నో" అన్నాడు కోచ్.
ఆ ఆటగాడు జవాబిచ్చాడు.
"లైన్ మెన్ లలో నేనే ఫాస్టెస్ట్. నేనే ఎప్పుడూ గెలుస్తాను. అది నాకు తెలుసు. ఎప్పుడూ నేనే గెలుస్తాను కాబట్టి నాలో నిర్లక్ష్యం వస్తుంది. పట్టుదల తగ్గుతుంది. అందుకనే నా కన్నా వేగంగా పరుగెత్తే వాళ్లతో పోటీపడి, నన్ను నేను సవాలు చేసుకుంటున్నాను. మరింత వేగంగా పరుగెత్తడం అలవాటు చేసుకుంటున్నాను. ఆముదం చెట్టులా ఉండటం నాకిష్టం లేదు." అన్నాడు.
మనల్ని మనం ఛాలెంజ్ చేసుకోవడంలోనే నిజమైన విజయం ఉంది. సాధించిన దానితో సంతృప్తిని చెంది ఊరుకోవడం ఉన్న చోటే నిలుచుని పరుగెత్తడం లాంటిది.
సో.... రన్ రాజా రన్ !!!
నిజమైన విజయమే... నిజమైన విజయం. చాలా బాగుంది సార్.
ReplyDeleteచాలా మంచి విషయాన్ని చెప్పారు సార్ , మీ బ్లాగు , మీ విషయ సేకరణ అద్భుతం అండీ!!
ReplyDelete