ఒక్క దెబ్బ
ఒక పడవ ఇంజన్ చెడిపోయింది.
యజమాని ఎంత ప్రయత్నించినా అది బాగుపడలేదు. చాలా మంది ఇంజనీర్లు, కన్సల్టెంట్లు, ఎక్స్ పర్టులు వచ్చారు. వెళ్లారు.
ఇంజన్ మాత్రం యథాతథం.
చివరికి ఒక ముసలి మెకానిక్ వచ్చాడు.
" పడవను నేను బాగు చేస్తాను" అన్నాడు.
ఎందరో నిపుణులు చేయలేనిది ఈ ముసలి మెకానిక్ ఏం చేయగలడు అనుకున్నాడు యజమాని, అయినా ఒకసారి ప్రయత్నిస్తే పోయేదేమిటిలెమ్మని " సరే...నీ ఫీజు ఎంత?' అని అడిగాడు.
"అయ్యా....వెయ్యి రూపాయలు. అదీ పనయ్యాకే ఇవ్వండి"
"సరే ...కానీ..."
ఆ మెకానిక్ ఇంజన్ ను కాసేపు పరిశీలనగా చూశాడు. ఆ తరువాత తన టూల్ బాక్స్ ను తీసి సుత్తి బయటపెట్టాడు.
ఒక చోట నెమ్మదిగా దెబ్బ వేశాడు.
అంతే...
ఇంజన్ స్టార్టయింది.
యజమాని ఇదంతా చూశాడు.
"ఏమయ్యా...నువ్వు ఒక చిన్న దెబ్బ వేశావు. దానికే వెయ్యి రూపాయలా?"
"చిత్తం...నుత్తి దెబ్బకి రెండు రూపాయలండీ. అయితే ఎక్కడ కొట్టాలో తెలిసినందుకు 998 రూపాయలండీ" అన్నాడు ఆ ముసలి మెకానిక్ ....
ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్న!!
టీచర్ పిల్లలకు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నల పరీక్ష పెట్టింది.
అందులో చిట్టచివరి ప్రశ్న "మన స్కూలులో పనిచేసే ప్యూను పేరేమిటి?"
అందరూ ప్యూనును చూస్తూనే ఉన్నారు.
కానీ ఆమె పేరు తెలియదు.
"ఈ ప్రశ్నకు మార్కులుంటాయా టీచర్" ఒక విద్యార్థి ఉండబట్టలేక అడిగేశాడు.
"అన్ని ప్రశ్నలకూ ఒక్కో మార్కు. ఈ ప్రశ్నకి మాత్రం యాభై మార్కులు" అన్నారు టీచర్.
మనతో ఉండేవారు, అతి చిన్న పని చేస్తూ ఉండేవారు, అట్టడుగున ఉన్న వారి గురించి తెలుసుకోవడం, వారిని పట్టించుకోవడం, ప్రేమగా పలకరించడం అన్నిటికన్నా ముఖ్యమైనది.
అందుకే ఈ ప్రశ్నకు అన్ని మార్కులు.
ఇప్పుడు చెప్పండి.
ఈ ప్రశ్నకు మీకెన్ని మార్కులు వస్తాయి?
Subscribe to:
Post Comments (Atom)
50 markulu Rakaji :) and meeku 100 marks for the brilliant katha
ReplyDelete