చూస్తూ చూస్తూనే ఇంకో వారం క్యాలెండర్ నుంచి Ctrl Alt Del అయిపోయింది.
మరో వారం మరో Window లా Open అవుతోంది.
కొత్త Icon పై క్లిక్ చేసి కొత్త Windowని ఓపెన్ చేసేయండి.
మళ్లీ ఏడు రోజుల్ని Scroll Down చేద్దాం.
మళ్లీ URLogist లుగా మారిపోదాం.
మళ్లీ Grtలు, LoLలు, RoFlలు, he he heలు, ASAP లు మొదలు.
మళ్లీ Apple తింటూ, Byte కి Byte కి మధ్య Mouse తో ఆడుకుంటూ Viral ఫీవర్ ని ఎంజాయ్ చేద్దాం.
సరదాలను Search చేసుకుని, జ్ఞాపకాలని Save చేసుకుని, ఆనందాన్ని Backup file లో దాచుకుని, వర్రీలను, కొర్రీలను Recycle Bin లోకి తోసేసి, Empty Recycle Bin నొక్కేసి మరీ రెడీ అవుదాం.....
కష్టాలకు Pause చెబుదాం.
కన్నీళ్లను Sleep Mode లో పెడదాం.
లైఫ్ కి Re-start బటనే తప్ప Shut Down లేదని చెబుదాం......
Funny :)
ReplyDelete