ఒక తండ్రి తన కుమారుడితో ....
తండ్రిః నువ్వు నేను ఎంపిక చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి.
కొడుకుః లేదు నాన్నా... నేను నాకిష్టమైన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను.
తండ్రిః నేను నీకోసం చూసిన అమ్మాయి బిల్ గేట్స్ కూతురు మరి....
కొడుకుః అయ్యబాబోయ్... అయితే నాకు ఓకే....
ఆ మరుసటి రోజు తండ్రి బిల్ గేట్స్ కి కలిశాడు.
తండ్రిః మీ అమ్మాయికి ఒక చక్కని అబ్బాయిని వరుడిగా తెచ్చాను.
గేట్స్ః ఛ... ఛ ... మా అమ్మాయి చిన్న పిల్ల ... దానికి ఇప్పుడే పెళ్లేమిటి?
తండ్రిః కానీ ఆ కాబోయే అల్లుడు వరల్డ్ బ్యాంక్ కి ఉపాధ్యక్షుడు మరి....
గేట్స్ః అలాగా... అయితే ఓకే....
ఆ తరువాత రోజు.... ఆ తండ్రి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిని కలిశాడు.
తండ్రిః మీ బ్యాంకుకి ఒక చక్కని వైస్ ప్రెసిడెంట్ ని తెచ్చాను...
అధ్యక్షుడుః ఇప్పటికే అవసరానికి మింది ఉపాధ్యక్షులున్నారు. ఇంకొకరెందుకు?
తండ్రిః ఆ అబ్బాయి బిల్ గేట్స్ కి అల్లుడు మరి.....
అధ్యక్షుడుః ఎంత మాట.... అంత గొప్పవారింటి అల్లుడిని తప్పకుండా ఉపాధ్యక్షుడిగా నియమిస్తాను....
గాలిలో మేడ... నేలపై ఓడ.... ఏదైనా అనుకొండి.... కార్యసాధకుడి బిజినెస్ సీక్రెట్ ఇదే మరి....
భలే!!
ReplyDelete