రూల్స్ ఆఫ్ లవ్ అండ్ వార్..... - Raka Lokam

రూల్స్ ఆఫ్ లవ్ అండ్ వార్.....

Share This



లవ్........

సాగరతీరంలో ఒక అందమైన పీత....
ఎనిమిది కాళ్ల బుడిబుడి నడకలతో హొయలుపోతూ తీరమంతటా సందడి చేస్తోంది.
ఇసుకపై దాని కాలి అడుగుజాడలు అందంగా గీసిన ముగ్గులా కనబడుతున్నాయి.
అంతలోనే సముద్రపుటల విసురుగా వచ్చింది.
ఆ అడుగుజాడలు చెరిపేసింది.
పీతకి కోపం వచ్చింది.
"ఏమిటిది సముద్రా.... నువ్వు నాకు దోస్తువనుకున్నాను. నా అందమైన అడుగుజాడలను ఎందుకు చెరిపేస్తున్నావు..." అని విసురుగా విమర్శించేసింది. అంతటితో ఆగకుండా "నేనంటే నీకు అసూయ" అంటూ మెటికలు విరిచింది.

"లేదు మిత్రమా.... నీ అడుగుజాడలను పట్టుకుని ఎవరైనా వేటగాడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడేమోనని నా భయం. అందుకే అడుగుజాడలు దొరక్కుండా చేశాను."

పీత కృతజ్ఞతతో సముద్రాన్ని ముద్దాడింది.
మిత్రుడినే అనుమానించినందుకు సిగ్గుతో తలవంచుకుంది.

అండ్ వార్.....




కోట శత్రుదుర్భేద్యమైనదే.
కానీ లోపల రాజు, మంత్రి, ఒకరిద్దరు సైనికులు మాత్రమే ఉన్నారు.
కోట చుట్టూ వేలాదిమంది శత్రుసైనికులు...
రాజుగారి గుండె జారిపోయింది.
"మనం ఇక ఏం చేయగలం... ఇక మన చావు ఖాయం" అని వలవల ఏడ్చాడు.
మంత్రి మాత్రం ధైర్యం కోల్పోలేదు.
"మహారాజా... మన కోటలోని అత్యంత ఇరుకైన మార్గాన్ని తెరుద్దాం. అందులోనుంచి ఒక సమయంలో ఒకే శత్రువు దూరి రాగలడు. వచ్చినవాడిని వచ్చినట్టే కత్తికొక కండగా చేసేద్దాం."
రాజుగారు నమ్మకం లేనట్టు మంత్రి వైపు చూశాడు.
"అందరినీ ఒక్కసారే ఎదుర్కోవడం కష్టం మహారాజా! ఒక్కొక్కడూ వచ్చేలా చేయగలిగితే ఎంతమందినైనా చంపేయగలం." అన్నాడు మంత్రి.

No comments:

Post a Comment

Pages