క్యాట్ షాక్ ..... - Raka Lokam

క్యాట్ షాక్ .....

Share This



ఒకావిడకి విచిత్రమైన మానసిక రోగం.

తానొక ఎలుకనని ఆమె భావన. అందుకే పిల్లుల్ని చూస్తే చాలు భయంతో వణికిపోతుంది. పరుగులు పెడుతుంది. కేకలు వేసి అల్లరిచేసేస్తుంది.

ఆమెను ఒక సైకియాట్రిస్టు దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన చాలా పరీక్షలే చేశారు. చివరికి హిప్నోటిజం ద్వారా "నేను ఎలుకను కాను. నేను మనిషిని" అని ఆమెను నమ్మించారు.

ఆమె కూడా "అవును ... నేను ఎలుకను కాను" అనుకుంది. "హమ్మయ్య... నేను ఎలుకను కాను...." అంటూ హిప్నాటిస్టుకి ఫీజు ఇచ్చి బయటకు వెళ్లింది.

క్షణాల్లో మళ్లీ పరుగెత్తుకుంటూ వచ్చేసింది. భయంతో గజగజ వణికిపోతోంది....

"ఏమైంది" అని అడిగాడు హిప్నాటిస్ట్.

"పిల్లి... బయట పిల్లి ఉంది" అంది ఆవిడ భయంతో ....

"నువ్వు ఎలుకవి కావు కదా ... నీకు భయమెందుకు?"

"నేను ఎలుకను కాను. ఆ విషయం నాకు తెలుసు."

"మరి భయమెందుకు?"

"ఆ విషయం పిల్లికి తెలియదు కదా!"

No comments:

Post a Comment

Pages