hi - Raka Lokam

hi

Share This
హలో ....నేనూ బ్లాగూ చొక్కా తోదిగేసుకున్నానోచ్. వెబ్బాటకి వచ్చేస్తున్నానోచ్.  
కాస్త ఆలస్యం అయిందని తెలుసు. కానీ మా మహేష్ అన్నయ్య చెప్పినట్టు ఎప్పుదోచ్చామని కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అన్నదే కీలకం.
నా గురించి కాస్త. ....
నేను చాలా భయంకరమైన మతతత్వ వాదిని. బ్లడీ కమ్మూనల్ ఫెలోని. నిజం చెప్పకురా దెబ్బ తింటావ్ అని చాలా మంది చెప్పారు. కాని మతతత్వవాదిగానే ఉండిపోయానుపైగా ఆ సంగతి చెప్పడానికి అస్సలు సిగ్గు పడని వాడిని.
కుండ బద్దలుగొట్టడం అలవాటు. ఇప్పటికే చాలా కుండలు బద్దలైపోయాయి. దేశం గురించి మాట్లాడటం ఫాషన్ కాదని తెలుసు. కానీ పదే పదే అదే తప్పు చేస్తూంటాను. గ్లోబల్ యుగంలో స్వదేశీ గురించి మాట్లాడే తప్పు చేస్తూంటాను. లెఫ్టు రైటు అనేస్తే చాలా సౌకర్యాలు ఉంటాయని తెలుసు. కానీ నా నోరు రైటే రైటు అంటుంది.  నష్ట పోతూ ఉంటుంది కూడా. ఎప్పుడో ఏ దిగ్విజయ సింగో హేమంత కర్కరేని చంపింది నేనే అని ఖాయంగా అంటాడు. అప్పుడి పురోహిత్ పక్క సెల్లో, ప్రజ్ఞా ఠాకూర్ పొరుగు సెల్లో నాకు రాసి పెట్టుందని చాలా మంది హెచ్చరిస్తున్నారు.
నా సమస్యల్లా ఒక్కటే. అబద్ధం చెప్పలేక పోతున్నాను. అదేమిటో...కాషాయం చూస్తె చాలు ఒళ్ళు మరిచిపోతాను.
నాకు నచ్చింది రాస్తాను. మీకు నచ్చింది చదవండి. నచ్చనిది చూస్తే ఇష్టం వచ్చినట్టు తిట్టేయండి. తిట్టే హక్కు మీకు పూర్తిగా వుంది. మీ హక్కులకు నా హామీ. అయితే...నేనొక దయానిధి మారను . మీరెన్ని తిట్టినా నేను మారను గాక మారను. సమస్య ఏమిటంటే నేను చిన్నప్పుడే కమిట్ అయి పోయా. ఇక నా మాట నేనే వినను.
ఇక కాస్కో నా వాస్కోడిగామా!!!!!

8 comments:

  1. Hai Namaste Sudhakar garu.
    Your first post is very good. I think we need not hide any thing because the facts come out even if we try to keep it a secret.
    I am sending a mail to you. Though boring, read it completely and sent me your feed back.

    Avadhani

    ReplyDelete
  2. hi sir iam sreenivas sakshi tv miru mi bloglo rasindi chusanu chala baga rasaru .u know sir iam u r fam

    ReplyDelete
  3. నేను కరుణానిధిని, దయానిధిమారన్ లను వెనకేసుకొస్తూంటాను. బ్లాగ్లోకానికి స్వాగతం!

    ReplyDelete
  4. రాకా,
    చుసాను నీ బ్లాగు,..... బాగా నచ్చింది నీ పరిచయం...మానవ తత్వ వాదివి కదా నువ్వు ! అచ్చు తప్పు అనుకుంటా మత తత్వ వాది వన్న పదంలో ...
    నీ కాషాయ ఆవేషాన్ని కలం ద్వార జనాల గుండెల్లో బుల్లెట్స్ దించుతావని ఆశిస్తు .......శుభాకాంక్షలతో .....నీ శ్రావన్

    ReplyDelete
  5. :-) great intro....Sudhakargaru, although I do understand why you put this blog in Telugu...it took a lot of time to read...also you are limiting yourself by putting it in Telugu...why don't you consider putting it in English and try to reach more ppl ?

    ReplyDelete
  6. రాకా గారు... ఓపెనింగ్ అదిరింది... ఇక బాక్సాఫీస్ బద్దలు కావడమే తరువాయి.... (ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుంది)

    ReplyDelete
  7. Raka garu,
    I am extremely pleased after reading your blog. All the best.
    P.V.R. Somanadha Sarma

    ReplyDelete
  8. మీ బ్లాగ్ చదివితే చాలు మీరెవరో తెలుస్తది.. ఇక మీగురించి మీరి ప్రత్యేకంగా చెప్పుకోవాలా?

    ReplyDelete

Pages