అసొంలో బంగ్లాదేశీ చొరబాటుదారుల్ని తరిమేయడంలో ఏదీ చిత్తశుద్ధి? - Raka Lokam

అసొంలో బంగ్లాదేశీ చొరబాటుదారుల్ని తరిమేయడంలో ఏదీ చిత్తశుద్ధి?

Share This
ఒక్క అక్రమ చొరబాటుదారుడిని మన దేశం నుంచి తరిమేయడానికి మన ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోంది?
1985లో అసొం ఒప్పందం తరువాత అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులను ఏరివేయడానికి అసొం ప్రభుత్వం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. అధికారుల్ని నియమించింది. ఆఫీసుల్ని తెరిచింది.
అసొంలో 1977 నుంచి 1983 దాకా ఏడేళ్ల పాటూ సుదీర్ఘంగా చొరబాటుదారులకు వ్యతిరేకంగా భారీ ప్రజా ఉద్యమం నడిచింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కర్ఫ్యూ విధిస్తే, లక్షల మంది ప్రజలు దాన్ని ధిక్కరించి రోడ్లమీదకి వచ్చారు. విదేశీ ఓటర్ల పేర్లు తొలగించనిదే ఎన్నికలు నిర్వహించరాదని, ఒక వేళ నిర్వహిస్తే ఎన్నికలను బహిష్కరిస్తామని ఉద్యమనేతలు హెచ్చరించారు. ప్రభుత్వం మొండిగా ఎన్నికలు నిర్వహించింది. ప్రజలు ఓటు వేయలేదు. చాలా నియోజకవర్గాల్లో 200 ఓట్లు కూడా పడలేదు. అంత ఉధృతంగా సాగింది ఉద్యమం.
ఆ తరువాత విదేశీ చొరబాటుదారులకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించిన ప్రఫుల్ల కుమార్ మహంత ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనే అతి కీలకమైన హోంశాఖ బాధ్యతనూ చేపట్టారు. అలాంటి అసొంలో 1985 నుంచి 2007 వరకూ ఎంతమంది విదేశీయులను ఏరివేశారో తెలుసా? అక్షరాలా 2221 మంది.
అంటే నాలుగు రోజులకు ఒకడు చొప్పున అన్న మాట.
దీని కోసం ఈ వ్యవధిలో ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం 405 కోట్లు.ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 404,78,08,897 రూపాయలు.
అంటే ఒక్క చొరబాటుదారుడిని తరిమేయాలంటే అయ్యే ఖర్చు ఎంత? (కాస్త ఊపిరి బిగబట్టండి....గుండె దిటవు చేసుకొండి). అక్షరాలా 18.22 లక్షలు.
ఒక్క మాటలో చెప్పాలంటే కొండను తవ్వి ఎలుకను పట్టడం సంగతి అటుంచితే కనీసం బొద్దింకను సైతం పట్టుకోలేదన్న మాట.
2004 నుంచి 2007 మధ్యలో ఢిల్లీ మహానగరంలోనుంచి 16,551 మంది బంగ్లాదేశీ చొరబాటుదారులను గుర్తించి బయటకు పంపించేశారు. అదే సమయంలో, అత్యంత సమస్యాగ్రస్తమైన అసొంలో కేవలం 405 మందిని గుర్తించారు. బయటకు పంపించింది పట్టుమని పదకొండు మందిని మాత్రమే.
1985-2007 మధ్యకాలంలో అసొం ప్రభుత్వం కేవలం 42,449 మందిని మాత్రమే అనుమానితులుగా గుర్తించింది. అంటే మిగతా విదేశీ చొరబాటుదారులను అసొం ప్రభుత్వం కనీసం అనుమానించలేదు. మరోవైపు అసొం ఉద్యమం నాటికి బర్పేటా, సిల్చర్, కరీంగంజ్, గోల్పారా జిల్లాలు మాత్రమే ముస్లిం మెజారిటీ జిల్లాలుగా ఉండేవి. ఇప్పుడు నవగావ్ , మరీగావ్, మంగళ్దోయి, హైలాకందీ, బొంగాయిగావ్ జిల్లాలు కూడా ముస్లిం మెజారిటీ జిల్లాలుగా మారిపోయాయి. ఈ జనాభా పెరుగుదల అక్రమ చొరబాట్ల వల్లేనన్నది జగమెరిగిన సత్యం.
కానీ ప్రభుత్వానికి అనుమానం వచ్చింది కేవలం 42,449 మంది పైనే. వారిలోనూ చివరికి బయటకు పంపించింది కేవలం 2221మందిని మాత్రమే.
1971 నుంచి, అంటే బంగ్లాదేశ్ ఏర్పాటు నుంచి 2000 వరకూ 7,68,609 మందిపై దర్యాప్తు చేపట్టారు. వీరిలో 7,61,162 మందిపై దర్యాప్తు పూర్తయింది. మిగతా వారిపై దర్యాప్తు కూడా పూర్తికాలేదు. ఈ 7,61,162 కేసుల్లో 3,45,464 కేసులను స్క్రీనింగ్ కమిటీకి పంపించారు. ఈ కమిటీ 65,112 కేసులను ట్రిబ్యునల్ కి విచారణ నిమిత్తం పంపించడం జరిగింది. సదరు విదేశీ నిర్ధారణ ట్రిబ్యునల్ 20,179 కేసుల్ని కొట్టిపారేసింది. 11,706 మందిని మాత్రమే విదేశీయులుగా గుర్తించింది. వీరిలో 6,085 మందిని మన దేశం నుంచి వెళ్లగొట్టాటని కోర్టు తీర్పునిచ్చింది. కానీ వీరిలో బహిష్కరణకు నిజంగానే గురైన వారి సంఖ్య కేవలం 1,051.
ఒక్క మాటలో చెప్పాలంటే బంగ్లాదేశ్ ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకూ బహిష్కరణకు గురైనవారి సంఖ్య కేవలం 3272 మాత్రమే.
2001-02లో అసొం ప్రభుత్వం పోలీసులకు 33.02 కోట్లు, న్యాయస్థానాలకు 1.50 కోట్లు, కేటాయించింది. 2002-03 లో పోలీసులకు 34.30 కోట్లు, కోర్టులకు 1.95 కోట్లు కేటాయించారు. ఆ మరుసటి ఏడాది (2003-04) లో 24.85 కోట్లు పోలీసులకు, 1.75 కోట్లు కోర్టులకు కేటాయించడం జరిగింది. 2004-05 లో 32.92 కోట్లు పోలీసులకు, 1.75 కోట్లు కోర్టులకు ఇచ్చింది. 2005-06, 2006-07 లలో పోలీసులకు వరుసగా 37.79 కోట్లు, 76 కోట్లు కేటాయించడం జరిగింది.
ఈ నిధులన్నీ చిల్లు కుండలో పోసినట్టే అవుతోందన్నదీ, మన సరిహద్దు చిల్లుల జల్లెడలా మారిందని, వచ్చేవాళ్లు వరదలుగా వస్తే, తరిమివేయబడేవాళ్లు బొట్టుబొట్టుగా కూడా లేరని స్పష్టంగా అర్ధమౌతోంది.
ఉద్యమాలు చేసిన అసొం గణపరిషద్ ప్రభుత్వం, బాహాటంగా, నిర్లజ్జగా చొరబాటుదారులను సమర్థించే కాంగ్రెస్ ప్రభుత్వం కలిసికట్టుగా అసొం గొంతును రెండు దశాబ్దాలుగా నొక్కేస్తున్నాయన్నది సుస్పష్టం. అక్రమార్కులు, అసమర్థులు, అరాచకవాదులు కలిసి అసొంను పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంపై కూచోబెట్టారు. అసొం సహా ఈశాన్యరాష్ట్రాలన్నీ మరో కాశ్మీర్ గా మారే రోజు దగ్గర్లోనే ఉందని అసొం వ్యవహారాలను అధ్యయనం చేసే నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే జనాభాలో అత్యధిక ముస్లింలు ఉన్న రాష్ట్రాల్లో కాశ్మీర్ తరువాత రెండో స్థానంలో ఉన్నది అసొం రాష్ట్రమే. ఈ జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం అక్రమ చొరబాటే.
అసొం ఉద్యమం ఉధృతంగా సాగే రోజుల్లో "సేవ్ అసొం టుడే టు సేవ్ ఇండియా టుమారో" (రేపు భారత్ ను కాపాడుకునేందుకు నేడు అసొంను రక్షించండి) అన్న నినాదం వినిపించేది.
నిజాయితీగా మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఇలాంటి పరిస్థితే కొనసాగితే మనం నేడు అసొంను కాపాడుకోగలమా? రేపు భారత్ ను కాపాడుకోగలమా?

1 comment:

  1. బంగ్లాదేశ్ లో ౧౯౭౨ ముందు ఏం జరిగిందో చూస్తె, ఇప్పుడు హైదరాబాద్ లో జరిగేదానికి సారూప్యం ఉంది!
    ఆనాడు డెబ్బై శాతం హిందువులు బంగ్లాదేశ్ లో ఉండేవారు అందరు కలిసి స్వతంత్రం కోసం పోట్లడారు, కాని ఈనాడు అక్కడ జరిగింది ఏమిటి?
    అలాగే తెలంగాణా కోసం జరుగుతున్నా పోరాటం లో ఎందఱో హిందువులు బలిదానాలు చేస్తున్నారు, కాని తెలంగాణా వచ్చాక ఇంకో పది ఇరవై ఏళ్లలో ఎంతమంది హిందువులు ఉంటారో తెలంగాణా వేచిచూడాలి!

    ReplyDelete

Pages